CM KCR: బదిలీల్లో భార్యభర్తలకు ఓకే చోట పోస్టింగ్‌.. యాసంగిలో వరిధాన్యం కొనే పరిస్థితి లేదు..

CM KCR: నూతన జోనల్‌ వ్యవస్థ నిబంధనల ప్రకారమే ఉద్యోగుల విభజన చేపట్టాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు సీఎం కేసీఆర్.

Update: 2021-12-18 13:44 GMT

CM KCR: బదిలీల్లో భార్యభర్తలకు ఓకే చోట పోస్టింగ్‌.. యాసంగిలో వరిధాన్యం కొనే పరిస్థితి లేదు..

CM KCR: నూతన జోనల్‌ వ్యవస్థ నిబంధనల ప్రకారమే ఉద్యోగుల విభజన చేపట్టాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు సీఎం కేసీఆర్. స్థానిక యువతకు ఉద్యోగాల కల్పనతో పాటు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పాలన కొత్త జోనల్‌ వ్యవస్థతోనే అమల్లోకి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. వెనుకబడ్డ మారుమూల ప్రాంతాల్లోకి కూడా వెళ్లి ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయగలిగినప్పుడే సమగ్రాభివృద్ధి సాధ్యమని సీఎం కేసీఆర్ అన్నారు. నాలుగైదు రోజుల్లో ఉద్యోగుల విభజన ప్రక్రియను పూర్తిచేసి నివేదిక అందజేయాలన్నారు. ఉద్యోగులైన భార్యాభర్తలు ఒకేచోట ఉంటేనే వారు సమర్థవంతంగా పనిచేయగల్గుతారని చెప్పారు సీఎం కేసీఆర్.

యాసంగిలో వరిధాన్యం కొనే పరిస్థితి లేదని, కొనుగోలు కేంద్రాలు కూడా ఉండవని మరోసారి స్పష్టం చేశారు సీఎం కేసీఆర్‌. కేంద్రం అనుసరిస్తున్న ప్రమాదకర విధానాల నుంచి రైతాంగాన్ని కాపాడుకోవాలని చెప్పారు. అధికారులు క్షేత్రస్థాయిలో వెళ్లి ధాన్యం కొనబోమనే విషయాన్ని రైతులకు అర్థమయ్యేలా చెప్పాలని సూచించారు. వానాకాలంలో పత్తి, వరి, కంది సాగుపై రైతులు దృష్టి పెట్టాలన్నారు సీఎం కేసీఆర్.

Tags:    

Similar News