Telangana: తెలంగాణలో లాక్‌డౌన్, కర్ఫ్యూ ఉండదు- మంత్రి ఈటల
Telangana: తెలంగాణలో లాక్‌డౌన్, కర్ఫ్యూలాంటివి ఉండవని వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల స్పష్టం చేశారు.
Telangana: తెలంగాణలో లాక్‌డౌన్, కర్ఫ్యూలాంటివి ఉండవని వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల స్పష్టం చేశారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సమీక్ష నిర్వహించిన ఈటల ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలను పెంచుతున్నట్లు తెలిపారు. మొత్తం 33జిల్లాల్లో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఈటల తెలిపారు. జిల్లాల ఆస్పత్రుల్లో ఓపీ సేవలతోపాటు కరోనా ట్రీట్‌మెంట్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ప్రజలు భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదన్నారు. కేసులు పెరుగుతున్నా ఎక్కువ మందిలో లక్షణాలు లేవన్నారు. మరణాల రేటు కూడా తక్కువగానే ఉందన్నారు. ర్యాపిడ్ టెస్టులతో వెంటనే ఫలితం తెలుస్తోందని, పాజిటివ్ వచ్చిన వ్యక్తికి వెంటనే కరోనా కిట్ ఇస్తున్నట్లు చెప్పారు. రిపోర్టు వెంటనే రావడం వల్ల కాంటాక్టు ట్రేసింగ్ సులభమవుతోందన్నారు. టెస్టులను అవసరమైతే లక్ష వరకు పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి తెలిపారు.