Shakeel: జూబ్లీహిల్స్ యాక్సిడెంట్ కేసులో నా కుమారుడి ప్రమేయం లేదు
Shakeel: చేయని తప్పుకు కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు
Shakeel: పంజాగుట్ట యాక్సిడెంట్ కేసులో తన కుమారుడిని కేసులో ఇరికించేందుకు వెస్ట్ జోన్ డీసీసీ విజయ్ కుమార్ కుట్ర చేస్తున్నారని, తన కుమారుడి తప్పు ఉంటే చట్టబద్ధంగా ఉరి తీసినా ఒప్పుకుంటానని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అమేర్ అన్నారు. విదేశాల్లో చికిత్స పొందుతున్న షకీల్ ఓ వీడియో పోస్టు చేశారు. తన కుమారుడు చేయని తప్పుకు కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని, జూబ్లీహిల్స్ కేసులో తన కుమారుడు రాహిల్ ప్రమేయం లేదన్నారాయన.. దీనిపై సీబీఐతోగానీ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆయన కోరారు.
కేసు ట్రయల్‌లో ఉందని, కానీ తనపై రాజకీయ కక్ష ఉంటే తన కుమారుడిని ఇబ్బంది పెట్టడం సరికాదన్నారాయన.. తన కుమారుడు నడుపుతున్న కారు బారికేడ్లకు తగిలితే... 21 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసును పారదర్శకంగా విచారణ జరిపించాని ముఖ్యమంత్రిని ఆయన కోరారు.