Arvind Dharmapuri: భారీ వర్షాలపై కలెక్టర్లకు లేఖ రాసిన ఎంపీ అర్వింద్
Arvind Dharmapuri: అధికారులు అప్రమత్తంగా ఉండండి
Arvind Dharmapuri: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలపై నిజామాబాద్, జగిత్యాల జిల్లాల కలెక్టర్లకు ఎంపీ ధర్మపురి అర్వింద్ లేఖ రాసారు. పలు చోట్ల రోడ్లు తెగిపోయి.. రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని చెప్పారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, అర్ అండ్ బి, పోలీస్, విద్యుత్, ఆరోగ్య శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా తగు చర్యలు చేపట్టాలని ఎంపీ అర్వింద్ కోరారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ద్వారా 40 గేట్లు తెరిచినందున మత్సకారులు, జాలర్లను అప్రమత్తం చేయాలని, నిరాశ్రయులైన లోతట్టు ప్రాంతాల ప్రజలకు పునరావాస కేంద్రాలకు తరలించి, వారికి కనీస సౌకర్యాలు అందజేయాలని కోరారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావాదన్నారు. వ్యవసాయ మోటర్ల వద్ద రైతులు జాగ్రత్తగా ఉండాలని, గోదావరి పరివాహక గ్రామాల మత్సకారులు, జాలర్లు చేపల వేటకు వెళ్లకుండా ఉండాలని, ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే భారతీయ జనతా పార్టీ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొనాలని ఎంపీ అర్వింద్ కోరారు.