MLC Kavitha: కాంగ్రెస్ కావాలా..? బీఆర్ఎస్ కావాలా..?

MLC Kavitha: నిజామాబాద్ జిల్లా పెర్కిట్ బహిరంగ సభలో మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత

Update: 2023-08-25 09:42 GMT

MLC Kavitha: కాంగ్రెస్ కావాలా..? బీఆర్ఎస్ కావాలా..?

MLC Kavitha: వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలంటున్న కాంగ్రెస్ కావాలా..? 24 గంటలపాటు నిరంతర విద్యుత్తు ఇస్తున్న సీఎం కేసీఆర్ కావాలా అనేది రైతులు ఆలోచించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోరారు. బీజేపీ సర్కార్ వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టుమంటోందని ఆమె మండి పడ్డారు. కార్పొరేట్ కంపెనీలకు 17 లక్షల కోట్ల రుణమాఫీ చేసిన బీజేపీ ప్రభుత్వం.. రైతు రుణమాఫీకి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ సీఎం అభ్యర్థి కేసీఆర్ అని, మరి మీ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఆమె ప్రశ్నించారు.

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌ ఆర్మూర్‌లో భారీ ర్యాలీ నిర్వహించిన తర్వాత... పెర్కిట్‌లో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి టికెట్ పొందిన జీవన్‌రెడ్డిని ఆర్మూర్ ఓటర్లు ఆశీర్వదించాలని కోరారు. ఏ ఫర్ ఆర్మూర్, ఏ ఫర్ ఆశన్నగారి జీవన్ రెడ్డి అని ఆమె వ్యాఖ్యానించారు. 2014లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలపొంది... జీవోల జీవన్ రెడ్డిగా పేరు తెచ్చుకున్నారని, రెండోసారి 30 వేల మెజారిటీతో ప్రజలు ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించారని, ఇప్పుడు మూడోసారి 60 వేల మెజారిటితో గెలిపించాలని కోరారు. ఆకుల లలిత భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు ఇస్తామని స్పష్టం చేశారు. జీవన్ రెడ్డిని ఆశీర్వదించిన ఆమె మరింత ఉన్నత స్థానంలో ఉంటారని తెలిపారు.

బీజేపీ మూడు రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొస్తే... వాటిపై జరిగిన పోరాటంలో 850 మంది రైతులు మరణించారని, దీంతో నల్ల జీవోలను వెనక్కి తీసుకున్నారని గుర్తు చేశారామె.... 2007లో ఎర్రజొన్న రైతులకు మోసం జరిగితే... ధర్నా చేస్తున్న రైతులపై అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కాల్పులు జరిపిందని, చాలా మంది రైతులు గాయపడ్డారని అన్నారు. ఆ సందర్భంగా ఆ రైతులకు మద్దతుగా జీవన్ రెడ్డి 9 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారని, కేసీఆర్ ఆర్మూర్‌కు వచ్చి దీక్షను విరమింపజేశారని కవిత గుర్తు చేశారు. 

Tags:    

Similar News