MLC Kavitha: ఇవాళ సుప్రీంకోర్టులో కవిత కేసు విచారణ
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ కేసు విచారణ ఉత్కంఠ రేపుతుంది. తెలంగాణ ఎమ్మెల్సీ కవితను ఈ కేసులో సీబీఐ నిందితురాలిగా చేర్చి..నోటీసులు జారు చేసింది. ఈ నెల 26న విచారణకు హాజరుకావల్సిందిగా నోటీసులు జారీ చేసినప్పటికీ కవిత విచారణకు హాజరు కాలేదు. లిక్కర్ కేసులు ఈడీ సమన్లు రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది కవిత. అలాగే తనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఈడీకి ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టును కోరింది.
సీబీఐ గతంలో ఇదే కేసుకు సంబంధించి హైదరాబాద్ లోని కవిత నివాసానికి వచ్చి స్టేట్ మెంట్ తీసుకున్నది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కూడా పలు మార్లు కవితను ప్రశ్నించింది. సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉన్నందున విచారణకు హజరు కాలేనంటూ కవిత లేఖ రాసింది. ఆ తర్వాత ఈడీ నుంచి కవితకు ఏ విధమైన సమాధానం రాలేదు. సుప్రీంకోర్టులో పిటిషన్ పై ఈనల 28న విచారణ జరగనున్నది. ఈ కేసును జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిటల్ ధర్మాసనం విచారణ జరపనుంది. సీబీఐ విచారణకు కవిత హజరవుతారా లేదా అన్నదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది.