MLA Seethakka: చినజీయర్ స్వామిపై ఎమ్మెల్యే సీతక్క ఫైర్...
MLA Sithakka: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామి మీద ములుగు ఎమ్మెల్యే సీతక్క విమర్శలు గుప్పించారు.
MLA Sithakka: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామి మీద ములుగు ఎమ్మెల్యే సీతక్క విమర్శలు గుప్పించారు. సమ్మక్క-సారక్కలు దేవతలు కారని, వాళ్లేమైనా బ్రహ్మలోకం నుంచి ఊడిపడ్డారా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కామెంట్లపై సీతక్క తీవ్రంగా విమర్శించారు. ఆయన తెలంగాణ ప్రజలకు, ఆదివాసీ బిడ్డలకు క్షమాపణ చెప్పాలని ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేశారు. ప్రజలంతా దర్శించుకునే అడవి తల్లులకు ఒక్క రూపాయి కూడా లేదని, అదే మీరు 120 కిలోల బంగారంతో నిర్మించిన సమతామూర్తిని దర్శించుకోవడానికి 150 రూపాయలు టికెట్ పెట్టారన్నారు. ఆమె ట్వీట్ కు నెటిజన్లు భారీ స్థాయిలో రియాక్టవుతున్నారు.
సమ్మక్క సారక్క పవిత్ర ఉత్సవాలను అవమానపరిచే విధంగా చిన్న జీయర్ స్వామి మాట్లాడడం విచారకరమన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. జీయర్ స్వామి మేధావి అయితే కావచ్చు కానీ ఆయన వెంట ఉన్నవారంతా రియల్ ఎస్టేట్ వ్యాపారులేనన్నారు. పోరాటయోధుల్ని అవమానించినందుకు ఆయన క్షమాపణ చెప్పాలన్నారు.