MLA Poaching Case: ఎమ్మెల్యేలకు ఎర కేసు విచారణ రేపటికి వాయిదా
MLA Poaching Case: ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన దుష్యంత్ దవే
MLA Poaching Case: ఎమ్మెల్యేలకు ఎర కేసు విచారణ రేపటికి వాయిదా పడింది. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన దుష్యంత్ దవే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు క్రిమినల్ రిట్ కాదని హైకోర్టు దృష్టికి తెచ్చారు. అది మాండమస్ ఆర్డర్ మాత్రమేనని అప్పీల్ విచారణ జరిపే అధికారం డివిజన్ బెంచ్‌కు ఉందని వాదించారు. 226 ఆర్టికల్ ఇదే విషయాన్ని చెబుతోందని దుష్యంత్ దవే హైకోర్టు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. వాదనలు విన్న హైకోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది.