TGPSC: గ్రూప్-1పై ప్రభుత్వం అప్రమత్తం.. నేడు కీలక ప్రకటన చేసే అవకాశం
TGPSC Group 1: గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని, జీవో 29 ను రద్దు చేయాలని అభ్యర్ధుల చేస్తున్న ఆందోళన..
TGPSC Group 1: గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని, జీవో 29 ను రద్దు చేయాలని అభ్యర్ధుల చేస్తున్న ఆందోళన.. ప్రతిపక్షాల మద్దతుపై ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. మంత్రుల నివాస ప్రాంగణంలోని మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంట్లో మంత్రులు మంత్రులు దామోదర్ రాజా నర్సింహ, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. గ్రూప్ 1 పరీక్షలు, జిఓ 29 అంశం, గ్రూప్ 1 అభ్యర్ధులు చేస్తున్న విజ్ఞప్తులు, అభ్యంతరాలు, సాధ్యాసాధ్యాలపై సుధీర్ఘంగా చర్చించారు. అభ్యర్దులు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలపై ఉన్నతాధికారులతో మంత్రులు చర్చించారు.
గ్రూప్-1 పరీక్షను అసలు వాయిదా వేయడం సాధ్యమా అనే అంశంపైనా దాదాపు మూడు గంటల పాటు చర్చించారు. జీవో 29నపై వస్తున్న విమర్శలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సోమవారం రోజునే పరీక్షలు ఉన్నందున ఒక రోజు ముందు వాయిదా వేస్తున్నట్లు ప్రకటిస్తే చదువుకున్న అభ్యర్ధుల నుంచి ప్రతికూలత వస్తుందని కూడా భావిస్తున్నారు. పరీక్షను వాయిదా వేయకుండా.. ఏ ఒక్క అభ్యర్ది నష్టపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవలనే అంశంపై అధికారులతో చర్చించారు. ఇవాళ మరోసారి సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి.. ప్రభుత్వం సమగ్ర ప్రకటన చేయనున్నట్లు తెలుస్తుంది.