CM KCR: సీఎం కేసీఆర్‌తో మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్ భేటీ

CM KCR: 42 నియోజకవర్గాల్లో తొలివిడత ప్రచారం

Update: 2023-10-12 06:15 GMT

CM KCR: సీఎం కేసీఆర్‌తో మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్ భేటీ

CM KCR: ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్ భేటీ అయ్యారు. బీఆర్ఎస్‌ నలుగురు అభ్యర్థుల ప్రకటన.. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. ఇక కేసీఆర్ జిల్లాల పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి రూట్ మ్యాప్‌పై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ మేనిఫెస్టో కూడా సిద్ధం చేసింది. ఎన్నికలకు ముందే పార్టీలోని అసంతృప్త నేతలను బుజ్జగించడం.. పెండింగ్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించడంపై కేసీఆర్ వారితో సమాలోచనలు జరపనున్నారు. ఎలక్షన్స్ ఇన్‌ఛార్జ్‌లుగా ఎవరిని ఎక్కడ నియమించాలనే అంశంపై చర్చించనున్నారు.

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రచార షెడ్యూల్‌ ఖరారైంది. మొత్తం 17 రోజుల షెడ్యూల్‌ విడుదలైంది. ఈ నెల 15న హుస్నాబాద్‌తో మొదలై.. నవంబర్‌ 8న బెల్లంపల్లి సభతో సీఎం కేసీఆర్ తొలిదశ ప్రచారం ముగియనుంది. నవంబర్‌ 8న సిర్పూర్‌, ఆసిఫాబాద్‌, బెల్లంపల్లి సభతో గులాబీ బాస్‌ తొలివిడత ఎన్నికల ప్రచారం ముగియనుంది.

Tags:    

Similar News