Uttam Kumar Reddy: పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు
Uttam Kumar Reddy: నీటి పారుదలశాఖపై మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
Uttam Kumar Reddy: నీటి పారుదలశాఖపై మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రాధాన్యత ప్రాజెక్ట్‌లకు నిధుల కొరత ఉండదన్న మంత్రి ఉత్తమ్ నీటి పారుదలశాఖకు నిధుల కేటాయింపులు బాగున్నాయని.. పనులు వేగవంతం చేయాలన్నారు. అప్పగించిన పనులను సకాలంలో పూర్తయ్యేలా చూసే బాధ్యత అధికారులదేనన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పనులు సకాలంలో పూర్తి కావాల్సిందేనని.. పనులు మంచిగా పూర్తి చేసిన వారిని గుర్తిస్తామన్నారు.
పనుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు. కమిట్‌మెంట్, సిన్సియార్టీ తప్పకుండా ఉండాలని.. ప్రాజెక్ట్ పనులలో ఆలస్యం చేసే కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. పనులు బాధ్యతగా చేయాలి సకాలంలో పూర్తి కావాల్సిందేనన్నారు. ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చే విజ్ఞప్తులను వెంటనే పూర్తి చేయాలన్న మంత్రి ఉత్తమ్ ప్రజాధనం అత్యంత విలువైనదని ప్రతి పైసా జాగ్రత్తగా ఖర్చు చేయాలన్నారు.