జీహెచ్‌ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో పేరుతో కాంగ్రెస్ అన్నీ తప్పుడు హామీలు ఇస్తోందని ఆరోపించారు మంత్రి తలసాని. కరోనా, వరద సమయంలో హైదరాబాద్ ప్రజలను ఆదుకున్నది టీఆర్‌ఎస్ ప్రభుత్వమే అని ఆయన స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీలో బీజేపీ గెలిస్తే ఏం చేస్తారో చెప్పాలని ప్రశ్నించారు. బండి సంజయ్ ఎవరిపై సర్జికల్ స్ట్రయిక్ చేస్తారో చెప్పాలన్నారు. ఎంఐఎం కూడా అనవసర విమర్శలు చేస్తోందని మండిపడ్డారు తలసాని. వరద నష్టంపై కేంద్రానికి నివేదిక ఇచ్చి రెండు నెలలైనా అతీగతీ లేదన్నారు. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ముందు తన నియోజకవర్గాన్ని చూసుకుంటే బాగుంటుందని సూచించారు. కరీంనగర్‌లో ఉండే బండి సంజయ్‌కు హైదరాబాద్‌కు గురించి ఏం తెలుసని విమర్శించారు. హైదరాబాద్‌లో సర్జికల్ స్ట్రయిక్ చేస్తారా, మీకు నచ్చకపోతే దేశ బహిష్కరణ చేయండని ఆగ్రహం వ్యక్తం చేశారు.