KTR: ప్రజలపై పెట్రో, డీజిల్ భారాన్ని తగ్గించండి..

KTR: ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్ డిమాండ్

Update: 2022-08-25 05:21 GMT

 KTR: ప్రజలపై పెట్రో, డీజిల్ భారాన్ని తగ్గించండి..

KTR: ప్రజలపై పెట్రో భారాన్ని తగ్గించాలని మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా తగ్గుతున్న వేళ... పెట్రో రేట్లు తగ్గించాలని మోడీని కేటీఆర్ డిమాండ్ చేశారు. మోడీ ప్రధాని పదవిలోకి వచ్చిన నాటి నుంచి పెట్రోల్ ధరలు పెంచుతూనే ఉన్నారని ఆరోపించారు. అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా దేశంలో కేంద్ర ప్రభుత్వ పెట్రో దోపిడి మాత్రం ఆగడం లేదని ఆరోపించారు. ప్రస్తుతం ముడి చమురు బ్యారల్ ధర 95 డాలర్లకు తగ్గినా, పెట్రో రేట్లను తగ్గించడం లేదని అన్నారు. పెంచిన కొండంత ధరలను నామమాత్రంగా తగ్గించి, పేదల పట్ల మొసలి కన్నీరు కారుస్తుందని అన్నారు. ఇది ముమ్మాటికి నయవంచనకు పరాకాష్టనే అని ఎద్దేవా చేశారు. దేశంలో ఏర్పడిన ద్రవ్యోల్బణ పరిస్థితులు, కరోనా సంక్షోభం నేపథ్యంలో పెట్రో ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News