KTR: జేపీ నడ్డా.. అబద్ధాల అడ్డా.. కేరాఫ్ ఎర్రగడ్డ..
KTR: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
KTR: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. జేపీ నడ్డా అంటే కేంద్రంలో మంత్రిగా పనిచేసిన పెద్ద మనిషి అని ఇప్పటి వరకు కొంత గౌరవం ఉండేది. కానీ, నిన్న ఆయన మాటలు విన్న తర్వాత నడ్డాకు, బండి సంజయ్‌కు తేడా లేదని తేలిపోయిందన్నారు కేటీఆర్. బీజేపీ అంటే బక్వాస్ జెమ్లా పార్టీ అని ఫైర్ అయ్యారు. జేపీ నడ్డా ఓ అబద్ధాల అడ్డా అంటూ మండిపడిన కేటీఆర్ నడ్డా వెళ్లాల్సింది ఎర్రగడ్డకు అని కౌంటర్ ఇచ్చారు.
దేశంలోనే మొదటిసారి ప్రధానిని రైతులు వెనక్కి పంపించారని, రైతులు ప్రధానిని అడ్డుకున్నారంటే అంతకంటే సిగ్గుచేటు మరొకటి ఉండదని అన్నారు. నరేంద్ర మోదీ రైతు విరోధి అని మండిపడ్డారు. బీజేపీ ప్రజాస్వామ్యం గురించి దెయ్యాలు కూడా సిగ్గుపడుతున్నాయన్నారు. నిన్న రైతులను రెచ్చగొట్టి.. నేడు ఉద్యోగులను ఉసిగొల్పుతున్నారని విమర్శించారు.