Harish Rao: కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న మంత్రి హరీష్ రావు.. క్యూలైన్ నిర్మాణానికి మంత్రి శంకుస్ధాపన

Harish Rao: బీఆర్ఎస్ పాలనలో దేవాలయాలకు మహర్దశ

Update: 2023-07-05 07:33 GMT

Harish Rao: కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న మంత్రి హరీష్ రావు.. క్యూలైన్ నిర్మాణానికి మంత్రి శంకుస్ధాపన

Harish Rao: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆలయాలకు మహర్ధశ వచ్చిందని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారిని మంత్రి హరీష్ రావు దర్శించుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 12 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న క్యూలైన్ కాంప్లెక్స్ నిర్మాణానికి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు.

సీఎం కేసిఆర్ చొరవతో మల్లన్న ఆలయం వేగంగా అభివృద్ధి చెందుతుందని, ఆలయ అభివృద్ధి కోసం ఇప్పటికి 36కోట్ల నిధులను కేటాయించామని తెలిపారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ పూర్తి చేసి ఆ నీటితో స్వామివారి కాళ్ళను కడిగామని హరీష్ రావు అన్నారు.

Tags:    

Similar News