జాతీయ పార్టీలను నమ్మి మోసపోవద్దు - హరీష్ రావు

Harish Rao: కాంగ్రెస్, బీజేపీలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు...

Update: 2022-04-30 02:30 GMT

జాతీయ పార్టీలను నమ్మి మోసపోవద్దు - హరీష్ రావు

Harish Rao: జాతీయ పార్టీలను నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో పర్యటించిన మంత్రి హరీష్ రావు.. వర్ని మండలం జకోరాలో బీఎస్సీ నర్సింగ్ కాలేజీకి శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్, బీజేపీలపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంపై విమర్శలు చేసే పార్టీలు బాన్సువాడ నియోజకవర్గాన్ని చూడాలని సూచించారు.

బీజేపీ, కాంగ్రెస్ నేతలను గెలిపిస్తే... కేంద్రానికి గులాంగిరీ చేస్తారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ అడుగుపెట్టిన చోట కాంగ్రెస్ నాశనమవుతుందని విమర్శించారు. బీజేపీ నేతలు మత విద్వేశాలు రెచ్చగొడుతూ గొడవలు సృష్టిస్తున్నారని ఘాటైన విమర్శలు చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో.. మంత్రి హరీష్ రావు పర్యటించారు. వర్ని మండలం జాకోరాలో బీఎస్సీ నర్సింగ్ కళాశాలకు శంకు స్ధాపన చేశారు. జాకోరా ఎత్తిపోతల పథకం పనులకు భూమి పూజ చేశారు.

అనంతరం జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డ మంత్రి.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. డబుల్ బెడ్ రూంల నిర్మాణం పై విమర్శలు చేసే పార్టీలు బాన్సువాడ నియోజకవర్గాన్ని చూడాలని మంత్రి హరీష్‌రావు సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు సాధ్యమేనా అని మాట్లాడిన రాజకీయ పార్టీలు ఇప్పుడు ఏం సమాదానం చెప్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ హాయాంలో నిజాంసాగర్ ఎండిపోయింది నిజం కాదా అని ప్రశ్నించారు.

బీజేపీ కాంగ్రెస్ నేతలను గెలిపిస్తే.. కేంద్రానికి గులాంగీరి చేస్తారని ఎద్దేవ చేసిన మంత్రి.. రాహుల్ గాంధీ అడుగు పెట్టిన చోట కాంగ్రెస్ నాశనం అవుతోందని విమర్శించారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. బీజేపీ నేతలు మత విధ్వేషాలు రెచ్చ గొడుతూ హిందూ ముస్లిం ల మధ్య గొడవలు సృష్టిస్తున్నారని ఘాటైన విమర్శలు చేశారు. 15 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు.

ప్రభుత్వ రంగ సంస్ధల అమ్మకాల్లో భారీ అవినీతి జరుగుతుందని ఆరోపించారు. త్వరలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న మంత్రి.. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణ లో అమలవుతున్నాయని చెప్పుకొచ్చారు. బాన్సువాడ నియోజవర్గంలో మంత్రి పర్యటన.. టీఆర్ఎస్ శ్రేణుల్లో నయా జోష్ నింపింది. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి నియోజకవర్గం రాష్ట్రానికి ఆదర్శంగా ఉందని హరీష్ రావు కొనియాడారు

Tags:    

Similar News