Medico Preethi: మెడికో ప్రీతి కుటుంబానికి HMDAలో ఉద్యోగం..
* ఉత్తర్వులు జారీ చేసిన HMDA
Medico Preethi Case: దివంగత పీజీ మెడికో డాక్టర్ ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నది. ప్రీతి చనిపోయిన సమయంలో.. ఆమె కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ప్రీతి చెల్లెలు పూజకు HMDA ఐటీ సెల్‌లో కాంట్రాక్ట్ బేసిస్‌లో సపోర్ట్ అసోసియేట్‌గా ఉద్యోగం ఇప్పించారు. ఈ మేరకు HMDA సంబంధిత ఉత్తర్వులను జారీ చేసింది. అప్పట్లో ఆమె చదువుతున్న మెడికల్ కాలేజీలో ఏర్పడ్డ రకరకాల పరిణామాల మధ్య డాక్టర్ ప్రీతి మరణించింది. ఆ సమయంలో ఆమె కుటుంబానికి ప్రభుత్వం 10 లక్షలు ప్రకటించింది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తన నియోజకవర్గ పార్టీ తరఫున విరాళాలను సేకరించి.. 20 లక్షలు ప్రకటించి, ఆ మొత్తాన్ని వారికి అందచేశారు. అదే సమయంలో ప్రీతి కుటుంబం తమలో ఒకరికి ఉద్యోగం కావాలని పట్టుబట్టడంతో ఆ విషయాన్ని మంత్రి ఎర్రబెల్లి.. ప్రభుత్వం, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్.. తాను నిర్వహిస్తున్న పురపాలక శాఖ పరిధిలోకి వచ్చే HMDA ఐటీ సెల్‌లో కాంట్రాక్ట్ బేసిస్‌లో సపోర్ట్ అసోసియేట్‌గా ఉద్యోగం ఇప్పించారు.