ప్రీతిది ఆత్మహత్య కాదు హత్యే.. ఆ సర్జరీ ఎందుకు చేశారో చెప్పాలి: ప్రీతి సోదరుడు...

Medico Preethi: మెడికో ప్రీతి కేసు విచారణలో తమకు అనుమానాలున్నాయని ఆమె సోదరుడు పృథ్వీ అన్నారు.

Update: 2023-03-02 05:06 GMT

ప్రీతిది ఆత్మహత్య కాదు హత్యే.. ఆ సర్జరీ ఎందుకు చేశారో చెప్పాలి: ప్రీతి సోదరుడు...

Medico Preethi: మెడికో ప్రీతి కేసు విచారణలో తమకు అనుమానాలున్నాయని ఆమె సోదరుడు పృథ్వీ అన్నారు. యాంటీ ర్యాగింగ్ కమిటీ ఇచ్చిన నివేదిక.. పోలీసులు ఇచ్చిన రిమాండ్ రిపోర్టుల్లో ఉన్నదంతా అవాస్తవమని ఆరోపించాడు. ప్రీతిది ఆత్మహత్య కాదు హత్యే అనడానికి తమ దగ్గర ఆధారాలున్నాయని.. ఆత్మహత్య అని చెప్పడానికి ఏం ఆధారాలు ఉన్నాయని ప్రశ్నించాడు. తప్పు చేసిన నాగార్జున రెడ్డిని యాంటీ ర్యాగింగ్‌ కమిటీలో ఎలా ఉంచుతారని.. అతన్ని సస్పెండ్ చేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశాడు. అటు నిమ్స్‌లో జరిగిన ట్రీట్‌మెంట్‌ గురించి కూడా తమకు పూర్తి వివరాలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు పృథ్వీ. పొత్తి కడుపులో ఆపరేషన్ చేశారని..ఆ ఆపరేషన్‌ ఎందుకు చేశారో తెలపాలన్నారు. ప్రీతి మరణంపై పారదర్శకంగా విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరాడు.

Full View


Tags:    

Similar News