Maoist Hidma: తెలంగాణ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్.. మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతం..
Maoist Hidma: తెలంగాణ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్.. మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతం..
Maoist Hidma: మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగలింది. కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతమయ్యాడు. తెలంగాణ గ్రేహౌండ్స్ ఆపరేషన్‌లో ఎన్‌కౌంటర్ అయ్యాడు. తెలంగాణ- బీజాపూర్ సరిహద్దుల్లో గ్రేహౌండ్స్, సీఆర్‌ఫీఎఫ్ కోబ్రా ఆధ్వర్యంలో నిర్వహించిన ఆపరేషన్‌లో బలగాలు మట్టుబెట్టాయి. ఛత్తీస్‌ఘడ్, తెలంగాణ, ఒడిశా సహా పలు రాష్ట్రాల్లో మావోయిస్టు కీలక వ్యూహకర్తగా హిడ్మా వ్యవహరించాడు. 1996-97లలో 17 ఏళ్ల వయసులో అతడు ఉద్యమం పట్ల ఆకర్షితుడై మావోయిస్టుల్లో చేరాడు. చత్తీస్‌గడ్‌లోని దక్షిణ బస్తర్ జిల్లా సుక్మా జిల్లాలోని పువర్తి హిడ్మా స్వగ్రామం. ఇతనికి సంతోష్ అలియాస్ హిడ్మాగా వ్యవహరించేవారు. దలేరీలో హిడ్మా సమావేశమైనట్లు సమాచారం అందుకున్న భద్రతా బలగాలు.. పక్కా ప్రణాళికతో ఆపరేషన్ పూర్తి చేశారు.