School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్..సెప్టెంబర్ లో స్కూళ్లకు వరుస సెలవులు

School Holidays: తెలుగు రాష్ట్రాలు 2024లో రాష్ట్ర సెలవుల జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. పాఠశాల, కళాశాల విద్యార్థులు అందరికంటే ఎక్కువగా సెలవుల కోసం ఎదురుచూస్తున్నందున ఇది వారికి గుడ్ న్యూస్ అని చెప్పాలి.

Update: 2024-08-24 04:50 GMT

School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్..సెప్టెంబర్ లో స్కూళ్లకు వరుస సెలవులు

School Holidays: తెలుగు రాష్ట్రాలు 2024లో రాష్ట్ర సెలవుల జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. పాఠశాల, కళాశాల విద్యార్థులు అందరికంటే ఎక్కువగా సెలవుల కోసం ఎదురుచూస్తున్నందున ఇది వారికి గుడ్ న్యూస్ అని చెప్పాలి. అయితే ఇప్పటికే ఈ అకడమిక్ ఇయర్ లో ఆగస్టు నెలకు పూర్తయ్యేందుకు వచ్చింది. ఈ నెలలో 25 , 26వ తేదీల్లో రెండు రోజులు పాఠశాలలకు సెలవులు వచ్చాయి. వచ్చనెల సెప్టెంబర్ లో స్కూల్లకు ఎన్ని రోజులు సెలవులు వస్తున్నాయో తెలుసుకుందాం.

ముందుగా సెప్టెంబర్ 1వ తేదీ ఆదివారం వస్తుంది. ఆరోజు అందరికీ సెలవు ఉంటుంది. సెప్టెంబర్ 8,15,22,29వ తేదీల్లో ఆదివారం ఈ తేదీల్లోనూ సెలవు ఉంటుంది. ఇక ఆదివారాలు పోనూ..సెప్టెంబర్ 7వ తేదీ రెండో శనివారం, ఆరోజే వినాయక చవితి వస్తుంది. ఆరోజు కూడా అందరికీ సెలవు ఉంటుంది. సెప్టెంబర్ 16వ తేదీన ఈద్ మిలాదున్ నబా. ఈద్ మిలాద్ ఉన్ నబీ ముస్లింకు చాలా ప్రత్యేకమైంది. ఈరోజు అల్లా చివరి దూత అయిన ఇస్లామిక్ ప్రవక్త మహమ్మద్ జన్మదినాన్ని సూచిస్తుంది. ఈ పండగ సొందర్భంగా పాఠశాలలకు సెలవు ఉంటుది. మిలాద్ ఉన్ నబీ భారతదేశంలో సెప్టెంబర్ 15 సాయంత్రం ప్రారంభమై సెప్టెంబర్ 16వ తేదీ సాయంత్రం ముగుస్తుంది.

ఇలా సెప్టెంబర్ 15వ తేదీ ఆదివారం, సెప్టెంబర్ 16వ తేదీ సోమవారం రావడంతో వరుస సెలవులు రానున్నాయి. మొత్తంగా సెప్టెంబర్ నెలలో 6 రోజులు మాత్రమే సెలవు దినాలు ఉన్నాయి. దసరా సెలవులు అక్టోబర్ 4 నుంచి 13 వరకు ఉంటాయి. క్రియస్టియన్ మైనార్టి విద్యాసంస్థలకు దసరా సెలవులు అక్టోబర్ 11 నుంచి 13 వరకు ఉండనున్నాయి.

Tags:    

Similar News