శంషాబాద్‌లో విమానానికి తప్పిన ముప్పు.. టేకాఫ్‌ అయిన 15 నిమిషాల తర్వాత ఇంజిన్‌లో మంటలు

Shamshabad Airport: హైదరాబాద్ నుంచి మలేసియా రాజధాని కౌలాలంపూర్ వెళ్తున్న విమానానికి పెను ప్రమాదం తప్పింది.

Update: 2024-06-20 03:58 GMT

శంషాబాద్‌లో విమానానికి తప్పిన ముప్పు.. టేకాఫ్‌ అయిన 15 నిమిషాల తర్వాత ఇంజిన్‌లో మంటలు

Shamshabad Airport: హైదరాబాద్ నుంచి మలేసియా రాజధాని కౌలాలంపూర్ వెళ్తున్న విమానానికి పెను ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన 15 నిమిషాలకు కడివైపు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన పైలట్ వెంటనే అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరారు. పైలట్ రిక్వెస్ట్‌కు స్పందించిన శంషాబాద్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు కొద్ది సేపు విమానాన్ని గాల్లో చక్కర్లు కొట్టించారు. అనంతరం ప్రమాద తీవ్రతను గమనించి అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతించారు.

ప్రమాద సమయంలో విమానంలో సిబ్బందితోపాటు 130 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం సేఫ్‌గా ల్యాండ కావటంతో అందులోని ప్రయాణికులంతా ఊపిరిపీల్చున్నారు. అయితే వెంటనే ప్రమాదాన్ని గుర్తించటంతో ప్రమాదం తప్పిందని లేదంటే.. ఘోరం జరిగి ఉండేదని ఎయిర్‌లైన్ అధికారులు తెలిపారు.

Tags:    

Similar News