KTR: పీవీకి భార‌త‌ర‌త్న ఇచ్చి గౌర‌వించాలి.. కేంద్రానికి కేటీఆర్ వినతి..

PV Death Anniversary: భారతదేశానికి వన్నె తెచ్చిన నేత పీవీ నరసింహారావు అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.

Update: 2023-12-23 11:58 GMT

KTR: పీవీకి భార‌త‌ర‌త్న ఇచ్చి గౌర‌వించాలి.. కేంద్రానికి కేటీఆర్ వినతి..

PV Death Anniversary: భారతదేశానికి వన్నె తెచ్చిన నేత పీవీ నరసింహారావు అని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. అప్పుల్లో కూరుకుపోయిన భారత్‌ను... మన్మోహన్ సింగ్‌తో కలిసి గాడిన పెట్టేందుకు ఆయన కృషి చేశారన్నారు. దేశానికి తనవంతుగా సేవలు అందించారని కొనియాడారు. అలాంటి పీవీకి భారతరత్న ఇచ్చి గౌరవించాలని కేటీఆర్ అన్నారు. పీవీ విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయాన్ని సరిదిద్దాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. పీవీ వ‌ర్దంతి సంద‌ర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్ దగ్గర పూల‌ మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. ఆయన వెంట బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు ఉన్నారు.

Tags:    

Similar News