Delhi Liquor Case: కవిత అరెస్ట్.. నేడు ఢిల్లీకి కేటీఆర్, హరీష్‌రావు

Delhi Liquor Case: కేటీఆర్ వెంట ఢిల్లీ వెళ్లనున్న ప్రశాంత్‌రెడ్డి,.. మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, జాన్సన్ నాయక్

Update: 2024-03-17 01:52 GMT

Delhi Liquor Case: కవిత అరెస్ట్.. నేడు ఢిల్లీకి కేటీఆర్, హరీష్‌రావు

Delhi Liquor Case: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ ఏడు రోజుల కస్టడీ విధించింది. దీంతో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు, ఇవాళ ఢిల్లీ వెళ్లి కవితను కలవనున్నారు. వీరితో పాటు మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, జాన్సన్ నాయక్ హస్తినకు పయనం కానున్నారు. ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య కలిసేందుకు కోర్టు అవకాశం కల్పించింది. ఆ సమయంలోనే భర్త అనిల్, సోదరుడు కేటీఆర్‌తో పాటు హరీష్‌రావు న్యాయవాదులు కవితను కలిసే అవకాశం ఉంది. కాగా కవిత అరెస్టుపై ఆమె తండ్రి మాజీ సీఎం కేసీఆర్ ఇప్పటివరకూ రెస్పాండ్ కాలేదు. దీంతో పొలిటికల్ సర్కిల్‌లో జోరుగా చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News