KTR: ఈ సర్కారు తీరు మారకపోతే.. జనమే కాంగ్రెస్‌ను తరిమికొట్టడం ఖాయం

KTR: సురక్షిత మంచినీళ్లు కూడా ఇవ్వలేని సర్కార్‌ ఇది

Update: 2024-06-03 12:11 GMT

KTR: నల్గొండ వాటర్‌ ట్యాంక్‌లో మృతదేహం ఘటనపై కేటీఆర్‌ ఫైర్‌

KTR: నల్గొండ వాటర్‌ ట్యాంక్‌లో మృతదేహం ఘటనపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఫైర్‌ అయ్యారు. ట్విట్టర్‌ వేదికగా తెలంగాణ ప్రభుత్వంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాపాలన కాదు.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే పాలనంటూ మండిపడ్డారు. కోతల్లేని కరెంట్‌ ఇవ్వలేరు.. కోతకొచ్చిన పంటకు సాగునీళ్లు ఇవ్వలేరంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కోతులు పడి చనిపోయినా వాటర్‌ ట్యాంక్‌లను పట్టించుకోరని, చివరికి నల్గొండలోని నీటి ట్యాంకులో పదిరోజులుగా శవం ఉన్నా నిద్రలేవరని విమర్శించారు. సురక్షిత మంచినీళ్లు కూడా ఇవ్వలేని సర్కార్‌ ఇది.. ప్రజారోగ్యాన్ని పూర్తిగా గాలికొదిలేసిన గలీజు పాలన ఇది అంటూ ఫైర్‌ అయ్యారు. మిషన్‌ భగీరథ పథకంతో దశాబ్దాల తాగునీటి తండ్లాటను తీరిస్తే.. కనీసం నీటిట్యాంకుల నిర్వహణ కూడా చేతకాని అసమర్థ ప్రభుత్వం ఇదంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. గుర్తుంచుకోండి.. జలమే జగతికి మూలం.. ఈ సర్కారు తీరు మారకపోతే.. జనమే కాంగ్రెస్‌ను తరిమికొట్టడం ఖాయం అంటూ ట్వీట్‌ చేశారు కేటీఆర్.


Tags:    

Similar News