KTR: యువతను తప్పుదోవ పట్టించినందుకు ప్రభుత్వంపై ఛార్జ్‌షీట్ వేయాలి
KTR: కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో అరచేతిలో స్వర్గం చూపించింది.. బడ్జెట్‌లో మాత్రం మోచేతికి బెల్లం పెట్టిందని రేవంత్ రెడ్డి సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు.
KTR: కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో అరచేతిలో స్వర్గం చూపించింది.. బడ్జెట్‌లో మాత్రం మోచేతికి బెల్లం పెట్టిందని రేవంత్ రెడ్డి సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. రాష్ట్ర యువతను, నిరుద్యోగులను తప్పుదోవ పట్టించినందుకు అధికార పార్టీ నాయకులపై ఛార్జ్‌షీట్ వేయాలన్నారు కేటీఆర్. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చల సందర‌్భంగా అసెంబ్లీలో అధికార పక్షానికి.. ప్రతిపక్షానికి మధ్య డైలాగ్ వార్ నడిచింది. కాంగ్రెస్ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఇప్పటివరకూ అడ్రస్ లేకుండా పోయిందని కేటీఆర్ విమర్శించారు.