Koppula Eshwar: అమలు కాని హామీలు కాంగ్రెస్‌వి
Koppula Eshwar: వంద రోజుల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే.. ప్రజలు తిరగబడే రోజు వస్తుంది
Koppula Eshwar: కాంగ్రెస్ పార్టీ అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తుందని మాజీ మంత్రి, పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాజీ శాసనసభ్యులు దివాకర్ రావు నివాసం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ స్థానం నుండి అవకాశం కల్పించిన కేసీఆర్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కేవలం అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ అమలు కాని పథకాలను తీసుకువచ్చి.. ప్రజలను వంచిందని ఎద్దేవా చేశారు. వంద రోజుల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే ప్రజలు తిరగబడే రోజు వస్తుందని దీనికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.