నేటి నుంచి కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు
Komuravelli: తొలి పట్నం వారం కావడంతో భారీగా తరలివస్తున్న భక్తులు
Komuravelli: తెలంగాణ జానపద సంస్కృతి సంప్రదాయనికి ప్రతిబింబంగా విరాజిల్లుతున్న కోరమీసాల కొమురవెళ్లి మల్లన్న జాతర పట్నం వారనికి ముస్తాబైంది. సంక్రాంతి పండుగ తరువాత వచ్చే ఆదివారంతో మొదలయ్యే జాతర మూడు నెలలపాటు 12 ఆదివారాలతో ఉగాది పండుగ వరకు అంగరంగ వైభవంగా జరుగునున్నాయి. యాదవుల ఆడబిడ్డ అయిన గొల్ల కేతమ్మను మల్లన్న స్వామి వివాహమాడిన సందర్భంగా మొదటి ఆదివారం హైదరాబాద్ నుంచి పెద్ద సంఖ్యలో యాదవులు తరలి వచ్చి స్వామి వారికి పట్నాలు వేసి, బోనాలు సమర్పిస్తారు. అందుకే ఈ ఆదివారన్ని పట్నం వారంగా పిలుస్తారు. శనివారం మల్లన్న స్వామికి ఓడిబియ్యం సమర్పించి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. మరుసటి రోజు మల్లన్న సోదరి అయిన ఎల్లమ్మకు, మల్లన్నకు మట్టిపాత్రలో బోనం, పంచరంగులతో పట్నం సమర్పించి స్వామివారిని దర్శించుకుంటారు. ఈ తంతుతోనే కొమురవెల్లి మల్లన్న జాతర ప్రారంభమవుతుంది.
మల్లన్న జాతరకు కొమురవెల్లి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జాతరకు తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్ ఘడ్, రాష్ట్రల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో.. దర్శనం క్యూలైన్ లో చలువ పందిర్లు ,మంచి నీటివసతి కల్పిస్తూ భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తున్నమని ఆలయ ఈవో తెలిపారు. జాతరలో భక్తులకు అసౌకర్యం కలగకుండా సుమారు 300 మంది పోలీస్ సిబ్బందితో జాతరలో బందోబస్తు నిర్వహిస్తున్నమని ఆలయ ఈవో బాలాజీ తెలిపారు.