Zero Current Bill: ఫ్రీ కరెంట్ బిల్లు స్కీమ్‌పై కీలక అప్ డేట్ ..వారికి షాకిచ్చిన సర్కార్..బిల్లులు కట్టాల్సిందేనంటూ
Zero Current Bill: ఫ్రీ కరెంట్ పథకానికి సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. ఎవరైతే ఉచితంగా కరెంట్ వినియోగించుకుంటున్నారో...అలాంటి వారు ఈ విషయాన్ని కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. పూర్తి వివరాలు తెలసుకుందాం.
Zero Current Bill: జీరో కరెంట్ బిల్లులపై కీలక అప్ డేట్ ఒకటి వచ్చింది. ఫ్రీ కరెంట్ వినియోగదారులు కచ్చితంగా తెలుసుకోవాలి. లేదంటే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుంది. అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.
తెల్లరేషన్ కార్డు ఉంటే..గృహజ్యోతి స్కీం కింద 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ వినియోగించుకోవచ్చు. జీరో కరెంట్ బిల్లు ఇస్తారు. రూ. 1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఈ ఫ్రీ స్కీమ్ కింద ఇంకా ఎవరైనా చేరకపోతే..అలాంటి వారు నెల నెలా వచ్చే కరెంట్ బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ఇప్పటికే పలుసార్లు తెలిపింది. దీంతో చాలా మంది విద్యుత్ బిల్లులు చెల్లించకుండా ఉన్నారు. అయితే ఇప్పుడు ఇలాంటి వారికి సమస్యలు ఎదురవుతున్నాయి. బిల్లులు కట్టలేని వారికి విద్యుత్ బిల్లు ఏకంగా రూ. 3వేలు, రూ. 4వేలు చూపిస్తుంది. వరంగల్ జిల్లాలో కేటరిగీ 1 విద్యుత్తు మీటర్ల వినియోగదారులు 83,501 మంది ఉన్నారు.
ఇప్పటి వరకు గృహజ్యోతి కస్టమర్లు 53,283 మంది పథకానికి అర్హులని గుర్తించారు. వీరిలో ప్రస్తుతం 51,628 మంది కస్టమర్లకు జీరో బిల్లులు ఇచ్చారు. అయితే విద్యుత్ అధికారులు స్కీం వర్తించకముందు వచ్చిన బిల్లును తప్పనిసరిగా చెల్లించాలని చెబుతున్నారు. జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కాలనీలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తికి తెల్ల రేషన్ ఉన్నా అప్లయ్ చేసుకుంటే ఈ స్కీం వర్తించలేదు. మే, జూన్, జులై నెలకు సంబంధించిన బిల్లు బకాయి ఉణ్నారు. బకాయి చెల్లించాల్సిందేనని చెబుతున్నారు అధికారులు. ఈ పథకానికి కంటే ముందు ఉన్న బిల్లులు చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు.