TS Cabinet : వారికి మాత్రమే రుణమాఫీ, రైతు భరోసా..అందులో మీ పేరు ఉందో లేదో తెలుసుకోండి

Rythu Runa Mafi Guidelines: వారికి మాత్రమే రుణమాఫీ, రైతు భరోసా..అందులో మీ పేరు ఉందో లేదో తెలుసుకోండి.!

Update: 2024-06-22 01:14 GMT

 TS Cabinet : వారికి మాత్రమే రుణమాఫీ, రైతు భరోసా..అందులో మీ పేరు ఉందో లేదో తెలుసుకోండి

TS Cabinet:తెలంగాణలో రైతు రుణమాఫీపై సంచలన నిర్ణయం తీసుకుంది తెలంగాణ కేబినెట్. రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు అయిన ఈ సమావేశం రుణమాఫీ విధివిధానాలను వెల్లడించారు. ఎన్నికల సమయంలో తెలంగాణలో రూ. 2లక్షల వరకు రుణమాఫీ ఇస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారు. కాంగ్రెస్ మాట ఇస్తే వెనకడుగు వేయదని..రాహుల్ గాంధీ ఇచ్చిన హామీపై చర్చించి నిర్ణయం తీసుకున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. పలు బ్యాంకుల్లో ఉన్న రైతుల వివరాలన్నింటినీ తీసుకున్నాం. గత ప్రభుత్వం 10ఏండ్ల కాలంలో రెండు విడతలుగా రూ. 28వేల కోట్లు మాఫీ చేసింది. రైతులకురూ. 2లక్షల మాఫీ చేస్తామని..రైతు రుణమాఫీ చేయడానికి రూ. 31వేల కోట్లు అవసరం అవుతాయి. 2023 డిసెంబర్ 9వ తేదీ లోపు తీసుకున్న రైతుల రుణాలను మాఫీ చేస్తామని కేబినెట్ తెలిపింది.

అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే రైతు రుణాలు మాఫీ చేస్తున్నామని తెలిపారు. రైతు భరోసాకు సంబంధించిన పలు వర్గాల సూచనలతోపాటు విధివిధానాలను రూపొందిస్తున్నాం. రైతు భరోసాపై మంత్రివర్గ ఉపసంఘం వేశాము. జులై 15 నాటికి ఈ ఉపసంఘం నివేదిక వస్తుంది. రైతు భరోసా పారదర్శకంగా అమలు చేయాలని నిర్ణయించామని..అర్హులైన ప్రతి ఒక్కరికీ రైతు భరోసా అందిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. ప్రభుత్వ అధికార ప్రతినిధులుగా శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇద్దరు మంత్రులు ఉన్నారు.

అటు తెలంగాణలో పంట రుణాల మాఫీకి మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. 2023 డిసెంబర్ 9వ తేదీకి ముందు రైతులు తీసుకున్న రుణాలను మాత్రమే మాఫీ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఏకకాలంలో పంట రుణాలను మాఫీ చేయాలని మంత్రి వర్గం నిర్ణయించింది. దాదాపు 2గంటల పాటు కేబినెట్ సమావేశం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సాయంత్రం 4గంటలకు మంత్రివర్గ సమావేశం జరిగింది. పంటల బీమా, మద్దతు ధర, రుణమాఫీకిసంబంధించిన నిధులు సమకూర్చే విధానాలపై కేబినెట్ చర్చించింది. గత ప్రభుత్వం పలువురు అనర్హులకు కూడా ప్రభుత్వ పథకాలను అందించందనే అరోపణలు రావడంతో దానిపై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టింది.

కాగా ఆగస్టు 15 నాటికి రైతు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే పలు సార్లు చెప్పారు. దీంతో రేవంత్ రెడ్డి ముఖ్యంగా రుణమాఫీపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అయితే రుణమాఫీకోసంరూ. 39కోట్లు అవసరం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి అవసరమైన నిధుల సమీకరణకోసం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయ మార్గలపై ఫోకస్ పెట్టబోతున్నారు.

Tags:    

Similar News