BRS Manifesto 2023: కేసీఆర్ బీమా- ప్రతి ఇంటికి ధీమా పథకం

BRS Manifesto 2023: అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులకు రూ.4వందలకు గ్యాస్ సిలిండర్

Update: 2023-10-15 09:37 GMT

BRS Manifesto 2023: కేసీఆర్ బీమా- ప్రతి ఇంటికి ధీమా పథకం

BRS Manifesto 2023: అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ టార్గెట్‌గా స్కెచ్ వేస్తోన్న గులాబీ బాస్ కేసీఆర్.. తాజాగా.. బీఆర్ఎస్ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. కేసీఆర్ బీమా- ప్రతి ఇంటికి ధీమా పథకం పేరుతో..5 లక్షల బీమా పథకం, తెలంగాణ అన్నపూర్ణ పథకం కింద సన్నబియ్యం పంపిణీ, దశలవారీగా ఆసరా పెన్షన్ 5 వేలకు పెంపు వంటి అంశాలను మేనిఫెస్టోలో రూపొందించారు. ఇక రైతుబంధు సాయాన్ని మరోసారి పెంచారు. సంవత్సరానికి ఎకరాకు 12 వేల నుంచి 16వేలకు రైతు బంధు సాయాన్ని పెంచారు. సౌభాగ్య లక్ష్మి పథకం కింద పేద మహిళలకు నెలకు 3 వేల భృతి ఇవ్వనున్నట్లు తెలిపారు గులాబీ బాస్. ఇక గ్యాస్ సిలిండర్ కు సంబంధించి కీలక ప్రకటన చేశారు కేసీఆర్. అర్హులైన వారికి నాలుగు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు ఆరోగ్య శ్రీ గరిష్ట పరిమితిని 15 లక్షలకు పెంచుతున్నట్లు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు కేసీఆర్.

Tags:    

Similar News