CM KCR: బీజేపీ ముక్త్ భారత్‌తోనే దేశాభివృద్ధి సాధ్యం..
CM KCR: బీజేపీ ముక్త్ భారత్‌తోనే దేశాభివృద్ధి సాధ్యమని అన్నారు సీఎం కేసీఆర్.
CM KCR: బీజేపీ ముక్త్ భారత్‌తోనే దేశాభివృద్ధి సాధ్యమని అన్నారు సీఎం కేసీఆర్. ఇప్పటికే ఆ దిశగా అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయని, బీజేపీ వ్యతిరేక శక్తుల్ని సంఘటితం చేస్తున్నామని చెప్పారు. దేశంలో నితీశ్‌కుమార్ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత అని, విస్తృత చర్చ తర్వాత ఎవరి నేతృత్వంలో ముందుకెళ్లాలో నిర్ణయిస్తామన్నారు. తమతో వచ్చేవారితో కలిసి వెళ్తామని, రానివారిని వదిలిపెడతామన్నారు సీఎం కేసీఆర్.
బీజేపీ పాలనలో దేశం తీవ్రంగా నష్టపోయిందని, అందుకే దేశంలో బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కావాలని, ఈ విషయం గురించి నితీశ్‌తో కూడా చర్చించామని చెప్పారు. దేశానికి రొటీన్ ప్రభుత్వాలు వద్దని, భారత్‌ను మార్చే ప్రభుత్వం రావాలని చెప్పారు. బీజేపీ కేవలం అబద్ధాలతోనే పాలన సాగిస్తోందని విమర్శించారు. గుజరాత్ మోడల్ గురించి ఒక విలేకరి ప్రశ్నించగా.. గుజరాత్ మోడల్ విఫలమైందని, అలాంటి మోడల్ దేశానికి అవసరమా అని కేసీఆర్ ప్రశ్నించారు. గుజరాత్‌లో కూడా తాగునీరు, విద్యుత్ సమస్యలు ఉన్నాయని చెప్పారు.