18న ఖైరతాబాద్‌ మహాగణపతి కర్రపూజ

హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ గణపతి ఉత్సవాలు విజయవంతంగా 65 ఏండ్లు పూర్తి చేసుకున్నాయి.

Update: 2020-05-12 05:24 GMT
Khairathabad Ganesh (File Photo)

హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ గణపతి ఉత్సవాలు విజయవంతంగా 65 ఏండ్లు పూర్తి చేసుకున్నాయి. 65 ఏండ్లుగా ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహించే ఉత్సవాలను 66వ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించాలని ఖైరతాబాద్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ సభ్యులు నిర్ణయించారు. ఇందులో భాగంగానే ప్రతి ఏడాది చేసినట్టుగానే ఈ సంవత్సరం కూడా తొలి ఏకాదశి రోజు కర్ర పూజ నిర్వహించి పనులు ప్రారంభించడానికి నిర్ణయించుకున్నారు.

ఈ నెల 18న సాయంత్రం 5 గంటలకు ప్రారంభించే కర్రపూజలో పాల్గొనే వారు తప్పనిసరిగా మాస్క్‌ ధరించి, సామాజిక దూరం పాటించాలని ఉత్సవ కమిటీ అధ్యక్షులు సింగరి సుదర్శన్‌ పేర్కొన్నారు. ప్రస్తతం దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని వినాయకుడి తయారీ, ఎత్తు విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. పోలీసుల అనుమతి తీసుకున్న తరువాతే ఈ విషయంపై వెళతామని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.

Tags:    

Similar News