Congress: వలసల పర్వం.. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌ల పదవిల కోసం ముందే కర్చీఫ్

Congress: ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు లాభమంటున్న రాజకీయ విశ్లేషకులు

Update: 2024-03-09 06:51 GMT

Congress: వలసల పర్వం.. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌ల పదవిల కోసం ముందే కర్చీఫ్

Congress: రాజకీయాల్లో పార్టీలు మారడం సర్వసాధారణం. అయితే గెలిచిన పార్టీలోకి దూకడానికి నాయకులు ముందు వరుసలో ఉంటారు. విలువల కంటే కూడా మనం అధికారంలో ఉన్నామా లేదా అని చూసుకునే వారే ప్రస్తుత కాలంలో ఎక్కువగా అగుపిస్తుంటారు. ఇప్పుడు తెలంగాణలో కూడా అదే జరుగుతోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తరువాత కాంగ్రెస్‌లోకి వలసల ప్రవాహం పెరిగిపోయింది. లోకల్ నేతలు అడ్డుకట్ట వేసిన ఆగకుండా ఏదో ఓ సాయంతో పార్టీలో జాయిన్ అవుతున్నారు. మాజీ మంత్రుల నుండి మొదలుకుని సర్పంచ్‌ల వరకు అందరూ కాంగ్రెస్‌లోకి క్యూ కడుతున్నారు.

తాజాగా సర్పంచ్‌ల పదవి కాలం ముగియడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెజార్టీ మాజీ సర్పంచ్‌లు కాంగ్రెస్‌లో పార్టీలో చేరుతున్నారు. వచ్చే ఎన్నికల్లో సర్పంచ్‌గా లేకపోతే ఎంపీటీసీ, జడ్పీటీసీగా పోటీ చేయడానికి ఇప్పుడే కాంగ్రెస్‌లోకి వచ్చి కర్చీఫ్ వేసుకుంటున్నారు. మరొ వైపు ఇప్పటికే చాలా మంది కార్పొరేటర్‌లు మేయర్‌లు డిప్యూటీ మేయర్‌లు సైతం కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యారు.

పార్లమెంట్ ఎన్నికల ముందు గ్రామ స్థాయిలో ఉన్న మాజీ సర్పంచ్‌లు, టౌన్‌లలో ఉన్న కార్పొరేటర్‌లు జాయిన్ అవుతున్నారు. ఇదే తమ పార్టీ పథకాలు ప్రచారం చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందని కాంగ్రెస్ భావిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Tags:    

Similar News