Telangana Govt Jobs: తెలంగాణలో ఈ నెల చివరి వారంలో ఉద్యోగ నోటిఫికేషన్లు..!
Telangana Govt Jobs: ఈ ఏడాది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.
Telangana Govt Jobs: ఈ ఏడాది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా మొదటగా 30,453 పోస్టులకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ నెలాఖరులో లేదా మే నెల మొదటి వారంలో ఒకటి, రెండు ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. నోటిఫికేషన్ల జారీకి ముందు చేయాల్సిన ప్రక్రియ కొనసాగుతోంది. ఈ కసరత్తు నెలాఖరులోపు పూర్తవుతుందని టీఎస్పీఎస్సీ అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు 503 గ్రూప్ 1 ఉద్యోగాలకి అనుమతులు మంజూరు చేసింది. వయో పరిమితిని పెంచాలని పలువురు నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడంతో పదేళ్లు, యూనిఫాం పోస్టులకి మూడేళ్లు వయోపరిమితి పెంచింది.
అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగ నియామక ప్రక్రియకు సంబంధించి ఇంటర్వ్యూ పద్దతిని కూడా రద్దు చేశారు. పోలీస్ శాఖకు సంబంధించి 16,587 ఖాళీల భర్తీకి అనుమతులు జారీచేసింది. అయితే పలు ఉద్యోగాలకు సంబంధించి సర్వీసు నిబంధనలు, ఎక్సైజ్ శాఖ పోస్టులకు ఫిజికల్ మెజర్‌మెంట్స్‌కు సంబంధించి కొన్ని మార్పులు, ఇతర పోస్టులకు కూడా కొన్ని ముఖ్య మార్పులున్నాయని, ఇవి సరిచేయకపోతే భవిష్యత్తుల్లో సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, అందుకు కొంత సమయం పడుతుందని, కసరత్తు అనంతరం కమిషన్ పరిశీలకు పంపవల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యితే నోటిఫికేషన్లు విడుదల అవుతాయని అధికారులు చెబుతున్నారు.