మైత్రీ మూవీ మేకర్స్‌లో ముగిసిన ఐటీ సోదాలు.. అర్థరాత్రి 2 గంటల వరకు కొనసాగిన ఐటీ తనిఖీలు

* అర్థరాత్రి 2 గంటల వరకు కొనసాగిన ఐటీ తనిఖీలు.. పలు కీలక పత్రాలు, హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్న అధికారులు

Update: 2022-12-13 04:28 GMT

మైత్రీ మూవీ మేకర్స్‌లో ముగిసిన ఐటీ సోదాలు

Mythri Movie Makers: తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్రగామి నిర్మాణ సంస్థగా కొనసాగుతున్న మైత్రి మూవీ మేకర్స్ పై ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మైత్రీ మూవీస్ ప్రధాన కార్యాలయం జూబ్లీహిల్స్ లో ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. నవీన్ ఏర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్.. సంస్థ అధినేతలుగా వ్యవహరిస్తున్నారు. బ్లాక్ బస్టర్ మూవీస్ అందించిన మైత్రీ మూవీస్.. పుష్ప, శ్రీమంతుడు, రంగస్థలం, సర్కార్ వారి పాట, నిర్మాణంలో ఉన్న చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలకు సంబంధించి ఇన్ కమ్ టాక్స్ చెల్లింపులు, పెట్టుబడులపై ఆరా ఐటీ తీసినట్లు తెలుస్తోంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ నాయకులపై కూడా ఐటీ ఫోకస్ చేస్తోంది. రాజకీయ నాయకులతో పాటు సినిమా నిర్మాతలకు సంబంధాలపై ఆరా తీస్తోంది. ఈ క్రమంలో ఐటీ అధికారులు మైత్రి మూవీస్ఆఫీసులో సుమారు 15 గంటలకు పైగా సోదాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. జూబ్లీహిల్స్‌లో ఉన్న మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో పాటు వారి ఇళ్లలో ఐటీ అధికారలు నిన్న ఉదయం 11 గంటల నుంచి అర్ధరాత్రి 2గంటల వరకు రైడ్స్ కొనసాగించారు. గత ఐదేళ్ల నుంచి ఆడిటింగ్ రిపోర్ట్, NRI పెట్టుబడులపై ఆరా తీసినట్లు సమాచారం. పలు కీలక పత్రాలు, హార్డ్‌డిస్క్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ లాంటి అగ్ర హీరోలతో ఈ సంస్థ సినిమాలను తెరపైకి తీసుకువస్తోంది. ఈ క్రమంలో పలు అనుమానాలతో ఐటీ అధికారులు ఒక్కసారిగా ఈ సంస్థపై సోదాలు నిర్వహించడం హాట్ టాపిక్ గా మారుతుంది. రీసెంట్ గా మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాల్లో పన్ను ఎగవేతపై పలు డాక్యుమెంట్లను పరిశీలించింది.

రీసెంట్‌గా పూరి జగన్నాథ్ ప్రొడక్షన్‌పై పలువురు రాజకీయ నాయకులు బ్లాక్ మనీతో ఇన్వెస్ట్‌మెంట్ చేసినట్లుగా ఆరోపణలు ఎదర్కొన్నారు. ఇక ఇప్పుడు అదే తరహాలో కొన్ని ప్రొడక్షన్ హౌస్‌లపై కూడా అనుమానాలు వస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మైత్రీ మూవీ సంస్థలో ప్రధానంగా NRIలు కూడా పెట్టుబడులు పెట్టినట్లు టాక్ కూడా వస్తోంది. ఇక ప్రముఖ రాజకీయ నాయకులు కూడా ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టి ఉండొచ్చనే కోణంలో ఐటీ అధికారులు సోదాలు చేశారనే టాక్ వినిపిస్తోంది. 

Full View
Tags:    

Similar News