లోన్ యాప్స్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. చైనాకు చెందిన లాంబోను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. చైనాకు పారిపోయేందుకు ప్రయత్నించిన లాంబోను ఢిల్లీ విమానాశ్రయంలో పట్టుకున్నారు. లాంబో 4 కంపెనీల ద్వారా లోన్ యాప్స్‌ను నడుపుతున్నట్లు గుర్తించారు. ఇక లాంబోకు సహకరించిన కర్నూల్‌కు చెందిన నాగరాజ్‌ను కూడా పోలీసులు ఢిల్లీలో అరెస్ట్ చేశారు. 6 నెలల్లో 21వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. లాంబో 150 యాప్స్ ద్వారా లావాదేవీలు జరిపినట్లు పోలీసులు గుర్తించారు. ఇండియా నుంచి పెద్దమొత్తంలో విదేశాలకు నిధుల మళ్లింపుపై సీసీఎస్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే వేల కోట్ల నిధుల మళ్లింపుపై సీసీఎస్ పోలీసులు కేంద్రానికి సమాచారం ఇచ్చారు.