Cyber Crime: సైబర్ నేరగాళ్లు లాభాలు చూపడంతో.. 89 లక్షలు ఇన్వెస్ట్‌మెంట్.. విత్‌డ్రా ట్రై చేస్తే డబ్బులు రాలేదు
Cyber Crime: మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్‌ను ఆశ్రయించిన బాధితుడు
Cyber Crime: ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు టోకరా వేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన రాజారాం అనే వ్యక్తిని ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో రాజారామ్‌కు సైబర్ నేరగాళ్లు వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపారు. మొదట ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో రాజారాం 20 వేలు ఇన్వెస్ట్‌మెంట్ చేశారు.
సైబర్ నేరగాళ్లు లాభాలు చూపడంతో రాజారామ్ పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్‌మెంట్ చేశారు. 89 లక్షలు ట్రేడింగ్ యాప్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేసిన రాజారామ్..తిరిగి డబ్బులు విత్‌డ్రా చేసుకుందామని ట్రై చేస్తే డబ్బులు రాలేదు.. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో వచ్చే లింకులపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.