Heavy Rain Alert: తెలుగురాష్ట్రాలకు హై అలర్ట్...భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్

Weather Report: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీగా కురుస్తున్న వర్షాలకు ప్రాణాలు కూడా పోతున్నాయి. నేడు వాతావరణం ఎలా ఉంటుందో..వాతావరణ శాఖ ఏం చెబుతుందో తెలుసుకుందాం.

Update: 2024-09-01 02:02 GMT

Rain Alert: బిగ్ అలర్ట్..తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల పాటు అతి భారీ వర్షాలు..ఐఎండీ వార్నింగ్

Weather Report: ఐఎండీ తెలిపిన వివరాల ప్రకారం గుజరాత్ పక్కన ఉన్న అస్నా తుఫాన్ నెమ్మదిగా పశ్చిమం వైపు వెళ్తుతోంది. దీని ప్రభావం మనంపై లేనట్లే అని చెబుతోంది. వాయుగుండం నేడు తీరం దాటనుంది. ప్రస్తుతం అది తుని , పిఠాపురం, కాకికనాడ, యానాం దగ్గరలో ఉంది. వాయవ్యం వైపుగా గంటకు 7 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. తుని, విశాఖ మధ్యలో తీరం దాటే అవకాశం ఉంది. మరోవైపు నైరుతీ రుతుపవనాలు చాలా చురుగ్గా కదులుతున్నాయి. ఈ పరిస్థితుల వల్ల ఏపీ, తెలంగాణలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు వారం కురుస్తాయి.

నేడు తెలంగాణ, కోస్తాంధ్ర యానాం దగ్గర అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయి. కొన్నిచోట్ల అత్యంత భారీ వర్సాలు కురుస్తాయి. సెప్టెంబర్ 1,2తేదీల్లో రాయలసీమపై భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అయితే నిన్నటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడ పరిసరాల్లో కంటిన్యూగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఏపీలో ఉదయం మోస్తరు వర్షం పడుతుంది. ఉదయం 9 తర్వాత తగ్గుతుంది. మధ్యాహ్నం 1 నుంచి ఉత్తరాంధ్రలో మోస్తరు వర్షం పడుతుంది. నేడు రాయలసీమలో వర్షం పడుతుందని ఐఎండీ చెప్పింది.

అటు భారీ వర్షాలకు విజయవాడలో ఇళ్లపై కొండచరియలు విరిగిపడి ప్రజలు ప్రాణాలు కోల్పోవడంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరపున రూ. 5లక్షల చొప్పున నష్ట పరిహారం ప్రకటించారు. మరణించినవారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా కల్పించారు. సహాయక చర్యలపై అధికారులతో సమీక్షించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారలు సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. 

Tags:    

Similar News