Hyderabad Police: రూ.10, రూ.1000, రూ.లక్ష... ఏది కావాలో తేల్చుకోండి
Hyderabad Police: కరోనా సెకండ్ వేవ్ దేశ వ్యాప్తంగా విస్తరిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ దీని ప్రభావం అధికమవుతూనే ఉంది.
Hyderabad Police: కరోనా సెకండ్ వేవ్ దేశ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లోనూ దీని ప్రభావం అధికమవుతూనే ఉంది. ఓ వైపు కేసులు వేల సంఖ్యలో పెరుగుతూనే ఉన్నాయి. మరోవైపు మరణాలు కూడా అదే స్థాయిలో నమోదవుతున్నాయి.
ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ, లాక్ డౌన్ ప్రకటిస్తున్నాయి. తెలంగాణలోనూ మంగళవారం నుంచి రాత్రి కర్ఫ్యూను అమలు చేస్తుంది ప్రభుత్వం. ఈ మేరకు హైదరాబాద్ పోలీసులు ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతున్నారు. మాస్క్ తప్పనిసరిగా ధరించాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ పోస్ట్ వైరల్ గా మారింది.
మాస్క్, పోలీస్ లోగో, హాస్పిటల్ ఫొటోలతో ఓ పోస్ట్ క్రియోట్ చేశారు. ఇందులో మాస్క్ కింద రూ.10లు, పోలీస్ లోగో కింద రూ.1000లు, హాస్పిటల్ కింద రూ.1,00,000 లు అని రాసి.. వీటిలో ఏది కావాలో మీరే నిర్ణయించుకోండని అవగాహాన కల్పిస్తున్నారు. పది రూపాయల మాస్క్ ధరిస్తే.. పోలీసులు విధించే రూ.వెయ్యి ఫైన్ నుంచి తప్పించుకోవడమే కాక, కోవిడ్ వస్తే హాస్పిటల్‌కి వెళ్లి రూ.లక్ష బిల్లు తప్పుందని అందులో పేర్కొన్నారు. ఈ ఫొటో కాచిగూడ ఎస్‌హెచ్‌వో పేరుతో ఉన్న అకౌంట్‌లో పోలీసులు పోస్ట్ చేశారు. దీంతో ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.