Telangana: హుస్సేన్ సాగర్‌లో గణేష్ నిమజ్జనానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్
Telangana: 2021 ఆదేశాలు యధావిధిగా కొనసాగుతాయన్న హైకోర్టు
Telangana: హుస్సేన్ సాగర్‌లో గణేశ్ నిమజ్జనానికి తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హుస్సేన్ సాగర్‌లో గణేష్ నిమజ్జనాలను నిషేధించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆ పిటిషన్‌పై మంగళవారం (సెప్టెంబరు 10) విచారణ జరిగింది. దీంతో హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనాలకు ధర్మాసనం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.