Heavy Rains Lash Karimnagar District: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అవగా మరికొన్ని ప్రాంతాల్లో జలకళని తెచ్చిపెట్టాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు జిల్లాలో కురిసిన వర్షాలతో కొన్ని చోట్ల వాగులు పొంగుతున్నాయి. చెరువులు మత్తడి దూకుతున్నాయి కరీంనగర్ జిల్లాలో జళకలపై స్పెషల్ స్టోరి.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలు జళకలని తీసుకొచ్చాయి. వాగులు, చెరువుల్లోకి నీళ్ళు చేరాయి మరికొన్ని చోట్ల వర్షాల వల్ల జలపాతాలు సవ్వడి అందరని ఆకట్టుకుంటున్నాయి. కరోనా సమయంలో బయట ఎక్కువగా టైం కేటాయించలేకపోవడంతో వీడియోలు చూస్తు జలపాతాల సవ్వడిని చాలా మంది ఎంజాయి చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు రోజులపాటు వరుణుడు దంచికొట్టాడు. మరోవైపు ఎగువ ప్రాంతాల్లో సైతం వర్షాలు పడటంతో వరదతో సిరిసిల్ల జిల్లాలోని మూలవాగులోకి వరద ప్రవాహావం వచ్చింది. వేములవాడ పట్టణానికి ఆనుకుని ఉండే మూలవాగు నియోజకవర్గంలో ఉన్న హాన్మాజిపేట నక్క వాగు ఇలా చాలా చోట్ల వాగులు పొంగుతు కనిపించాయి. మూల వాగులోకి వరద ప్రవహాం ఎక్కవగా రావడంతో అదికారులు అలెర్ట్ అయ్యారు.
హుజురబాద్ లో ఇటీవల కురిసిన వర్షాలకు చిలుక వాగులో నీటి ప్రవాహాం పెరిగింది. చిలుకవాగు పొంగడంతో ఇరువైపుల ఉన్న ప్రాంతాలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శంకరపట్నం గద్దపాక చెరువుల్లోకి నీళ్లు చేరడంతో మత్తడి దూకుతున్న నీళ్లని చూసి గ్రామస్దులు ఆనంద పడుతున్నారు. రైతులు నాట్లు వేసుకున్న సమయంలో వర్షం పడటంతో సరైన సమయంలో వరణుడు కరుణించాడంటు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక చెరువులు,వాగుల పరిస్దితి ఇలా ఉంటే జిల్లాలోని జలపాతాలు అందరిని ఆకట్టకుంటున్నాయి. సైదాపూర్ మండలం రాయకల్ లోని జలపాతంలోకి పెద్దఎత్తున నీళ్లు జాలువారుతుండటంతో యువకులు ఎంజాయి చేస్తున్నారు. గౌరివెళ్లి జలపాతంలోనూ నీటి ప్రవాహాం పెరిగింది. పెద్దపల్లి జిల్లా సబితం గ్రామశివారులోని జలపాతంలో కూడా నీళ్లు జాలువారుతున్నాయి. ఉమ్మడి జిల్లాలోని వాగులు వంకల్లో జలకళ సంతరించుకుంది.