Heavy Rains: మహారాష్ట్రను వణికిస్తోన్న భారీ వర్షాలు.. కుండపోత వానలతో నీట మునిగిన ముంబై

Heavy Rains: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మహారాష్ట్ర వణుకుతోంది.

Update: 2024-07-26 06:20 GMT

Heavy Rains: మహారాష్ట్రను వణికిస్తోన్న భారీ వర్షాలు.. కుండపోత వానలతో నీట మునిగిన ముంబై

Heavy Rains: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మహారాష్ట్ర వణుకుతోంది. లాతూర్, పూణే, థానే, ముంబైలో భారీ వర్షాలు నిండా ముంచాయి. కుండపోత వర్షాలకు ముంబై, పుణే ఆగమాగమయ్యాయి. రెండు సిటీల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. పలు విమానాలను అధికారులు రద్దు చేశారు. రైల్వే శాఖ కూడా పలు ట్రైన్లను దారిమళ్లించగా.. మరికొన్నింటిని క్యాన్సిల్ చేసింది. రైలు పట్టాలపై నీళ్లు చేరడంతో లోకల్ ట్రైన్లను నిలిపివేశారు. ఇక నగరాల్లో రోడ్లన్నీ నీట మునిగాయి.

ముంబైకి తాగునీరు అందించే ఏడు చెరువుల్లో రెండు పొంగి పొర్లుతున్నాయి. సియాన్, చెంబూర్, అంధేరి ప్రాంతాలు నీటమునిగాయి. ముంబై, థానే, రాయ్​గఢ్​కు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అయితే ముఖ్యంగా థానే పరిస్థితి దారుణంగా తయారైంది. నిన్న ఒక్క రోజే థానేలో 14 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను రెస్క్యూ సిబ్బంది సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. స్కూల్స్, కాలేజీలకు రెండు రోజుల పాటు అధికారులు సెలవు ప్రకటించారు. కాలనీలు జలమయం కావడంతో అపార్ట్‌మెంట్లు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. నిత్యావసరాల తెచ్చుకోవాడానికి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.

ఎగువ మహారాష్ట్ర ప్రాంతంలోని బద్లాపూర్ బ్యారేజీ, జంబుల్ డ్యామ్, మోహనే డ్యామ్ కు భారీగా వరద చేరుతున్నది. పాల్ఘర్ జిల్లాలోని ఉల్హాస్, కాలు నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. రాయ్​గఢ్​లోని సావిత్రి, అంబా, కుండలీక, పాతాళగంగా నదులు డేంజర్ మార్క్​ను క్రాస్ చేశాయి. భారీ వర్షాల నేపథ్యంలో సీఎం ఏక్​నాథ్ షిండే అధికారులతో సమావేశం అయ్యారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. ఈరోజు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటికి రావొద్దని సీఎం షిండే సూచించారు.

Full View


Tags:    

Similar News