Supreme Court: కవిత పిటిషన్‌పై విచారణ వాయిదా
Supreme Court: కవిత ఈడీ విచారణకు హాజరుకావడం లేదని.. కోర్టుకు తెలిపిన ఈడీ తరపు న్యాయవాది
Supreme Court: సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై విచారణ జరిగింది. విచారణను ధర్మాసనం ఈనెల 16కు వాయిదా వేసింది. కవిత విచారణకు హాజరుకావడం లేదని.. ఈడీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కవిత దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున.. విచారణకు హాజరుకావడం లేదని కోర్టుకు తెలిపారు న్యాయవాది కపిల్ సిబల్.
నళిని చిదంబరం, అభిషేక్ బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్లతో... కవిత పిటిషన్ టాగ్ అయినందున కేసుల స్టేటస్ వివరాలు తెలపాలని చెప్పింది. అన్ని కేసుల విచారణ ఒకేసారి చేపడతామన్న సుప్రీంకోర్టు.. ఈడీ నోటీసులకు కవిత హాజరుకావడం లేదని.. సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు అడిషనల్ సొలిసిటర్ జనరల్.