Harish Rao: మెడికల్‌ హబ్‌గా వరంగల్‌.. 10వేల కోట్లతో వైద్యవ్యవస్థ బలోపేతం

*వందశాతం వ్యాక్సినేషన్‌కు ఐఎంఏ సహకరించాలి *వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు

Update: 2021-11-22 01:25 GMT

హరీష్ రావు(ఫైల్ ఫోటో)

Harish Rao: వరంగల్‌ను మెడికల్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కాకతీయ వైద్య కళాశాల ఆడిటోరియంలో జరిగిన వరంగల్‌ ఐఎంఏ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న మంత్రి హరీష్ రావు హైదరాబాద్‌ తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్‌ నగరంలో 215 ఎకరాల్లో హెల్త్‌ సిటీ నిర్మిస్తామని ప్రకటించారు.

అందుకు సంబంధించిన మ్యాప్‌ ఇప్పటికే సిద్ధమైందన్నారు. కేఎంసీ, సెంట్రల్‌ జైలు, ఎంజీ ఎం, కంటి దవాఖానలకు సంబంధించిన 215 ఎకరాల స్థలంలో రెండువేల పడకల దవాఖానలు నిర్మిస్తామని చెప్పారు హరీశ్‌రావు. 1,200 పడకల దవాఖానలో అన్ని రకాల వ్యాధులకు వైద్యం అందిస్తామన్నారు. మరో 800 పడకలతో సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ నిర్మిస్తామని పేర్కొన్నారు.

Tags:    

Similar News