స్వస్థలానికి చేరుకున్న హవల్దార్ పరుశురాం పార్ధివదేహం
* జమ్మూ కశ్మీర్‌లోని లెహ్‌లో కొండచరియలు విరిగి ప్రాణాలు కోల్పోయిన పరుశురాం * రూ. 25లక్షలు ఆర్థిక సాయం, మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్రూం ఇళ్లు
జమ్ము కశ్మీర్ లోని లడక్ లేహ్‌లో కొండచరియలు విరిగి మహబూబ్‌నగర్ జిల్లా గుండీడ్ మండలం గువ్వని కుంట తండాకు చెందిన పరుశురాం ప్రాణాలు కోల్పోయారు.ఆయన పార్ధివదేహం నిన్న సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకుంది. అక్కడి నుంచి స్వగ్రామానికి తీసుకెళ్లారు. ఆర్మీలో హవల్దార్‌గా విధులు నిర్వహిస్తూ.. ప్రమాదవశత్తు ఆకాలమరణం పొందిన పరుశురాం భౌతిక కాయానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ రంజిత్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి నివాళులర్పించారు.
జవాను పరుశురాం కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం తరుపున 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం, మహబూబ్ నగర్ పట్టణంలో డబుల్ బెడ్రూం ఇంటిని ఇస్తున్నట్టుమంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. వీర జవాన్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందన్నారు.