Harish Rao: 2014కు ముందు పాలమూరు ఎలా ఉండే.. ఇప్పుడెలా ఉంది?
Harish Rao: ఆనాడు పాలమూరును దత్తత తీసుకుని చంద్రబాబు ఏం చేశారు?
Harish Rao: సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి హరీష్‌రావు ఫైర్ అయ్యారు. మహబూబ్ నగర్ వెనుకబాటుతనానికి నాటి కాంగ్రెస్, టీడీపీలే కారణమని మాజీ మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. వలస జిల్లాగా ఉన్న పాలమూరును కేసీఆర్ అభివృద్ది చేశారని అన్నారు. నాటి చంద్రబాబు, కాంగ్రెస్ పాపాలే పాలమూరు దుస్థితికి కారణమని అన్నారు. కాంగ్రెస్ పాలనలో పాలమూరు ప్రాజెక్టులను పెండింగ్‌లో పెట్టారని ఆయన విమర్శించారు. పెండింగ్ ప్రాజెక్టులను కేసీఆర్ రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చారని అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడే భాష తీరు మార్చుకోవాలని హరీష్‌రావు హితవు పలికారు. రేవంత్‌రెడ్డి తన పౌరుషాన్ని పాలన చూపించాలన్నారు.