TS Group 1 Effect: గ్రూప్‌ వన్ ఎఫెక్ట్‌.. కోచింగ్‌ సెంటర్లలో పెరిగిన హడావిడి..!

TS Group 1 Effect: తెలంగాణలో గ్రూప్‌ వన్ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం 19 కేటగిరీలకి సంబంధించి 503 పోస్టులని భర్తీ చేస్తున్నారు.

Update: 2022-04-28 02:30 GMT

TS Group 1 Effect: గ్రూప్‌ వన్ ఎఫెక్ట్‌.. కోచింగ్‌ సెంటర్లలో పెరిగిన హడావిడి..!

TS Group 1 Effect: తెలంగాణలో గ్రూప్‌ వన్ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. మొత్తం 19 కేటగిరీలకి సంబంధించి 503 పోస్టులని భర్తీ చేస్తున్నారు. మే 2వ తేదీ నుంచి ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. దీంతో నిరుద్యోగులు నగరబాట పడుతున్నారు. కోచింగ్‌ సెంటర్లలో చేరుతున్నారు. దీంతో పలు ఇన్సిట్యూట్లలో సందడి నెలకొంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో అయితే హడావిడి ఎక్కువగా ఉంది.

ముఖ్యంగా సివిల్స్‌కి ప్రిపేర్ అవుతున్నవారు గ్రూప్‌ వన్ పోస్టులపై దృష్టి సారిస్తున్నారు. దీంతో నగరంలోని కోచింగ్‌ సెంటర్లు , లైబ్రరీలు, దిల్‌సుఖ్ నగర్, అశోక్ నగర్‌, అమీర్‌పేటలలో నిరుద్యోగుల రద్దీ పెరిగింది. తాజాగా నోటిఫికేషన్ రావడంతో కోచింగ్‌ నిర్వాహకులు కూడా విపరీతంగా ఫీజులు పెంచేశారు.

గ్రూప్ వన్ పోస్టులకి అప్లై చేసేవారు ఒక ప్రణాళిక పరంగా చదివితే కచ్చితంగా విజయం సాధించవచ్చు. ముఖ్యంగా కొత్తగా అప్లై చేసేవారు చాలా పకడ్బందీగా చదవాల్సి ఉంటుంది.

పుస్తకాలతో కుస్తీ పడితే కానీ జాబ్‌ కొట్టలేరు. గ్రూప్-1 సర్వీసెస్ ఎగ్జామినేషన్ మనకి రెండు దశల్లో జరుగుతుంది. మొదటిగా ప్రిలిమినరీ పరీక్ష. రెండోది మెయిన్స్‌. టిఎస్పిఎస్సి గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష 150 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ఈ పరీక్ష లో క్వాలిఫై అయిన వారు రెండో దశలో నిర్వహించే మెయిన్స్ ఎగ్జామ్ కి అర్హత సాధిస్తారు. మెయిన్స్‌లో ఆరు పేపర్లు ఉంటాయి. ఇంగ్లీష్‌ క్లాలిఫయింట్‌ టెస్ట్.. ఒక్కో పేపర్‌కి 150 మార్కులు కేటాయిస్తారు.

Tags:    

Similar News