Mahesh Murder Case: రాష్ట్రంలో సంచలనం రేపుతున్న ఘట్కేసర్ ఎంపీటీసీ మర్డర్ కేసు

MPTC Mahesh Murder Case: మాజీ ఎంపీటీసీ మహేష్ ను దారుణంగా హత్య చేసిన దుండగులు

Update: 2024-06-25 16:30 GMT

Mahesh Murder Case: రాష్ట్రంలో సంచలనం రేపుతున్న ఘట్కేసర్ ఎంపీటీసీ మర్డర్ కేసు

Mahesh Murder Case: ఘట్కేసర్ లో జరిగిన మాజీ ఎంపీటీసీ మహేష్ దారుణ హత్య సంచలనం రేపుతోంది. రూంలో బంధించి.. కళ్ళలో కారం కొట్టి.. పారతో తల పగలగొట్టి.. చంపేశారు. అనంతరం మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా.. డంప్ యార్డ్ లో పూడ్చిపెట్టి చేతులు దులుపుకున్నారు హంతకులు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనుమానితులను విచారించడంతో హత్య ఉదంతం వెలుగు చూసింది..

ఘట్కేసర్ మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ రాజకీయంగా లోకల్ గా పలుకుబడి ఉన్న వ్యక్తి. ఆర్థికంగానూ బాగా సెటిల్ అయ్యాడు. మరికొన్ని నెలల్లో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సమాయత్తం అవుతున్నాడు. ఈ క్రమంలోనే గడ్డం మహేష్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈనెల 17 నుంచి మహేష్ అదృశ్యం అయ్యాడు. ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ లో కుటుంబసభ్యులు మిస్సింగ్ కంప్లయింట్ ఇచ్చారు. కేసు నమోదు చేసుకుని.. గడ్డం మహేష్ కోసం గాలిస్తున్న పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది.

మొత్తం ఆరుగురు వ్యక్తులు కలిసి గడ్డం మహేష్ ను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. గత కొంత కాలంగా భార్య నుంచి ఒంటరిగా ఉండటంతో.. ఇంట్లోకి చొరబడిన దుండగులు మహేష్ ను బంధించి.. కళ్ళలో కారం కొట్టారు. పలుగు, పారలతో తీవ్రంగా దాడి చేసి హతమార్చారు. హత్య చేసిన తర్వాత గడ్డం మహేష్ మృతదేహాన్ని శివారులో ఉన్న డంప్ యార్డ్ లో జేసీబీ సహాయంతో పూడ్చిపెట్టారు. అయితే.. గడ్డం మహేష్ హత్యలో మరో కోణం కూడా వినిపిస్తోంది. ఘట్కేసర్ లో ఉన్న ఓ స్థలం విషయంలో గడ్డం మహేష్ కు స్థానికంగా ఉండే వ్యక్తులతో కొన్ని రోజులుగా వివాదం నడుస్తోంది. వీళ్ళ మధ్య డబ్బులు ఇచ్చి పుచ్చుకోవడం వంటివి కూడా జరిగాయి. ఈ ఆర్థిక లావాదేవీల కారణంగానే హత్య చేసి ఉంటారన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

తన కొడును అత్యంత దారుణంగా హత్య చేసిన వాళ్లను అంతే దారుణంగా చేయాలని మృతుడి తల్లి డిమాండ్ చేస్తున్నారు. తన కొడుకు ఉసురు తీసిన వాళ్లు ఎవరైనా.. సరే.. శిక్ష అనుభవించాల్సిందేనని ఆమె డిమాండ్ చేస్తున్నారు.

హత్య చేసి పూడ్చిపెట్టి వారం కావడంతో.. మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయింది. డంప్ యార్డ్ లో పూడ్చిపెట్టిన స్థలం వద్దే పంచనామా నిర్వహించి.. పోస్ట్ మార్టం చేశారు వైద్యులు. అనంతరం డెడ్ బాడీ ని కుటుంబసభ్యులకు అప్పగించారు. డంప్ యార్డ్ వద్దకు ఘట్కేసర్ కి చెందిన జనాలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనుమానితుల నివాసాలపైకి బాధిథ కుటుంభ సభ్యులు దాడికి యత్నించారు. దీంతో పోలీసులు స్థానికంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఘట్కేసర్ ఎంపీటీసీ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగుళచూశాయి. మృతుడి ఫోనతోనే బందువులతో వాట్సప్ చాటింగ్ చేసారు నిందితులు. బతికే ఉన్న్నట్టు సిటిలో పనిఉండి వచ్చాను అని చాటింగ్ చేరు. ఇంకా మూడురోజులు పడుతుందని మృతిడి ఫోన్ తో చాటింగ్ చేస్తూ.. ఫోన్ సిగ్నల్ దొరక్కుండా వైఫై సహాయంతో వాట్సప్ చాటింగ్ చేయటం కొసమెరుపు.

Tags:    

Similar News