రేపు ఉదయం మారుతీరావు అంత్యక్రియలు

Update: 2020-03-08 08:47 GMT

మారుతీరావు మృతదేహానికి ఉస్మానియా ఆసుపత్రిలో పోస్ట్ మార్టమ్ పూర్తి అయింది. డెడ్ బాడీ మిర్యాలగూడ తరలించడానికి బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ఉదయం మిర్యాలగూడలో మారుతీరావు కు అంత్యక్రియలు నిర్వహిస్తారు.

అమృతాప్రయణ్ తండ్రి మారుతీరావు ఈరోజు (ఆదివారం) ఉదయం హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హోటలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే మారుతీరావు సూసైడ్‌ చేసుకున్న ప్రదేశంలో నోట్ లభ్యమైనట్లు తెలుస్తోంది.

అయితే ఆ సూసైడ్‌ నోట్‌లో అమృత గురించి రాసినట్లు సమాచారం. తల్లి అమృత నువ్వు అమ్మ దగ్గరికి వెళ్లిపో అంటూ లెటర్ రాసినట్లు తెలుస్తోంది. అయితే వారం రోజుల క్రితమే ఆస్తులన్నీ తన భార్య పేరు మీద రాసినట్లు తెలుస్తోంది.ఉదయం అపస్మారక స్థితిలో పడి ఉన్న మారుతీరావును చూసిన వైశ్య భవన్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.


Tags:    

Similar News