కోతుల కోసం 1.5 ఎకరాల్లో పండ్ల మొక్కలు

Telangna:కోతుల బెడద తప్పించుకోవడానికి ఓ గ్రామం కోతుల కోసం ప్రత్యేక ఆహారశాలను ఏర్పాటు చేసింది.

Update: 2021-02-28 04:12 GMT

ఫైనే Image

సంగారెడ్డి: అడవులు అంతరిస్తున్నాయి. పైగా జంతువులకు ఆహారం దొరకడం లేదు. ఇంకేముంది కోతులు గ్రామాలు, పట్టణాలు అన్న తేడా లేకుండా దండయాత్ర చేస్తున్నాయి. ఈ కోతుల బెడద తప్పించుకోవడానికి ఓ గ్రామం కోతుల కోసం ప్రత్యేక ఆహార శాలను ఏర్పాటు చేసింది. ఆ విషయాలు మీకోసం..

వినూత్న ఆలోచన..

గ్రామాల్లోకి వస్తున్న కోతుల బెడద తప్పించుకోవటానికి సంగారెడ్డి జిల్లాలోని ఒక గ్రామ పంచాయతీ వినూత్న ఆలోచన చేసింది. ఊరికి దూరంగా కోతుల కోసం ప్రత్యేకంగా ఆహార శాల ను ఏర్పాటు చేసింది. ఆహార శాల అంటే అదేదో నిత్యం పండ్లు, ఫలాలు కోతులకు అందిస్తారు అని పొరపాటు పడేరు. ఉద్దేశ్యం కోతులకు ఆహారం అందించడమే కానీ వాటి కోసం ప్రత్యేకంగా వందల పండ్ల మొక్కలను పెంచుతున్నారు.

కోతుల కోసం ప్రత్యేకంగా 1.5 ఎకరం లో పండ్ల మొక్కలు

సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం సిరిపుర గ్రామం ఈ కోతుల ఆహారశాల కు వేదికైంది. సిరిపుర గ్రామానికి దూరంగా గ్రామ శివారులో కోతుల కోసం ప్రత్యేకంగా 1.5 ఎకరం లో పండ్ల మొక్కలు పెంచుతున్నారు. జామ, మామిడి, అల్లనేరేడు, రేణి వంటి 15 రకాలకు చెందిన 1500 మొక్కలను పెంచుతున్నారు. మరో ఐదు నుండి ఆరు సంవత్సరాల్లో ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తోంది. సిరిపుర గ్రామం లాగే మరిన్ని గ్రామాల్లో ఇలా ఊరికి శివారులో పండ్ల మొక్కలను పెంచితే కోతులను ఊళ్ళోకి రాకుండా నివారించవచ్చు.

Tags:    

Similar News